Manda Jagannath: తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎంపీ.. వెంటిలేటర్‌పై చికిత్స

Former Nagar Kurnool MP and senior leader Manda Jagannatham At NIMS: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మందా జగన్నాథం అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించండంతో ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురవవ్వగా నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులు ఆయనకు పరామర్శించారు.

ఇదిలా ఉండగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ రాములు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు గద్వాల మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించారు. కాగా, గతంలో ఆయన టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పలు కీలక పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం మందా జగన్నాథం బీఎస్పీలో ఉన్నారు.