Harish Rao: పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావ్ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్ వేదికగా మోదీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ పట్ల ఎందుకీ వివక్ష అని మండిపడ్డారు. గుజరాత్ పత్తికి మద్దతు ధరగా రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణలో పండిస్తున్న పత్తికి రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
“One Nation, One Tax.”
“One Nation, One Election.”
“One Nation, One Ration Card”
“One Nation, One Market.”అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం,
One Nation, One MSP అని ఎందుకు ఇవ్వడం లేదు.పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉంది.
నాణ్యమైన…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 17, 2024