Site icon Prime9

Best Mobile Offers: మరి కొన్ని గంటలే ఛాన్స్.. కాస్ట్‌లీ మొబైల్స్‌ను చీప్‌గా కొనండి.. ఇదే చివరి అవకాశం!

Best Mobile Offers

Best Mobile Offers

Best Mobile Offers : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మీకు సువర్ణావకాశం అందిస్తోంది. సేల్‌లో అత్యంత శక్తివంతమైన ఫోన్‌లను రూ. 10,000 కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి మీ బడ్జెట్‌తో పాటు మీ అన్ని అవసరాలను తీరుస్తాయి. విశేషమేమిటంటే ఈ ఫోన్‌లలో మీరు అద్భుతమైన కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, స్టైలిష్ డిజైన్ వంటి సరికొత్త ఫీచర్లను చూస్తారు. అయితే ఈ రోజు అర్థరాత్రి 12 గంటలు సేల్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ డీల్స్‌పై ఓ లెక్కేయండి.

REDMI 12
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు దీన్ని ఇప్పుడు కేవలం రూ.7,999కే కొనచ్చు. ఫోన్‌లో 6 GB RAM+128 GB ROM, 6.79 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉన్నాయి. కెమెరా గురించి చెప్పాలంటే ఇది 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, Helio G88 ప్రాసెసర్ ఉంది.

SAMSUNG Galaxy A14 5G
ఈ సామ్‌సంగ్ గెలాక్సీ A14 5G కూడా సేల్‌లో భారీ తగ్గింపు పొందుతోంది. మీరు ఇప్పుడు కేవలం రూ. 9,999తో దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌లో 4 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ 50MP + 2MP + 2MP వెనుక, 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 5000 mAh బ్యాటరీ, Exynos 1330 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

Motorola g45 5G
ఈ ఫోన్ కూడా రూ.10 వేల లోపే సేల్‌లో అందుబాటులో ఉంది. దీని ధర ఇప్పుడు రూ.9,999కి పడిపోయింది. 4 GB RAM + 128 GB ROM ఉంది. 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేతో, ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ ఉంది.

POCO M6 5G
ఈ ఫోన్ కూడా సేల్‌లో చాలా చౌకగా లభిస్తుంది. మీరు ఇప్పుడు 30 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 9,799కి బుక్ చేయవచ్చు. ఈ ఫోన్ 6 GB RAM, 128 GB ROM, 6.74 అంగుళాల HD + డిస్ప్లేతో వస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే ఇది 50MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది Mediatek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

Vivo Y18
వివో ఫోన్ కూడా ఫ్లిప్‌కార్ట్బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో చాలా చౌక ధరలో లభిస్తుంది. కంపెనీ ఫోన్‌పై రూ.4500 తగ్గింపును ఇస్తోంది. ఆ తర్వాత దాని ధర రూ.9,499గా మారింది. ఫోన్‌లో 4 GB RAM, 128 GB ROM, 6.56 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే ఇది 50MP + 0.08MP వెనుక, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, Helios G85 ప్రాసెసర్ ఉంది.

Exit mobile version