Site icon Prime9

iPhone 15 Discount: కల నిజం చేస్కోండి.. రూ. 50 వేలకే ఐఫోన్ 15..!

iPhone 15 Discount

iPhone 15 Discount

iPhone 15 Discount: ఐఫోన్.. ఎంతో మంది కలల ఫోన్. దీన్ని కొనడానికి ఎందరో కిడ్నీలు అమ్మిన వార్తలు కూడా చూశాం. అటువంటి ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ దీపావళి సందర్భంగా ఊహించని ఆఫర్లు ప్రకటించింది. కొత్త దీపావళి సేల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 15ను 50,000 రూపాయల కంటే తక్కువ ధరకే కొనచ్చు. దీని లాంచింగ్ ధర రూ. 66,900. అలానే ఎంపిక చేసిన క్రెడిట్- డెబిట్ కార్డ్‌లపై బ్యాంక్ ఆఫర్లు అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్‌లపై భారీ క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఇది కొన్ని వేల రూపాయల తగ్గింపును ఇస్తుంది. అదనంగా మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే మీరు దానిని ఎక్స్ఛేంజ్ బోనస్‌గా మార్చుకోవచ్చు. మీరు ఈ ఆఫర్లను కలిపితే ఫోన్ ధర రూ.66,900 నుండి రూ.50,000 కంటే తక్కువకు వస్తుంది.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడితే ఇది A16 బయోనిక్ చిప్‌తో ఉంది. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్ లేదా హెవీ ా‌లను ఉపయోగించడానికి ఉత్తమమైనది. ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీకు పవర్ ఫుల్ కలర్స్, షార్స్ విజువల్స్ అందిస్తుంది. ఇది వీడియోలను చూడటానికి లేదా రీల్స్ స్క్రోల్ చేయడానికి స్మూత్ రన్నింగ్ అందిస్తోంది.

iPhone 15 iOS 17 ఆధారంగా రన్ అవుతుంది. ఇందులో 128GB, 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో కలర్స్‌లో లభిస్తుంది. ప్రొటక్షన్ కోసం ఫోన్  IP68 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 802.11 b/g/n/ac/ax, GPS, బ్లూటూత్ v5.30, NFC, USB టైప్-C, 3G, 4G (కొన్ని LTE నెట్‌వర్క్‌లు ఉపయోగించే బ్యాండ్ ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే iPhone 15 కూడా 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని అర్థం మీరు తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలను తీయచ్చు. అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా చాలా బాగుంది. ఇది ల్యాండ్‌స్కేప్‌లు లేదా గ్రూప్ ఫోటోలకు గొప్పది. 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు తీసుకోవడానికి లేదా వీడియో కాల్స్ చేయడానికి ఇష్టపడే వారికి కూడా ఉత్తమమైనది.

Exit mobile version