Site icon Prime9

Gopi sundar: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి కన్నుమూత

Famous Music director Gopi Sundar’s mother Livi Suresh Babu passes away : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్‌చెరిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన తల్లి ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చికిత్స చికిత్స తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి అపార్ట్‌మెంట్‌లోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందులో గోపీ సుందర్.. తన బాధను వ్యక్తం చేయగా.. తన తల్లిని ఓ మార్గదర్శిగా, తన జీవితంలో స్థిరమైన శక్తిగా కొనియాడారు.

ఇందులో భాగంగానే గోపీ సుందర్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ అమ్మా.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమతో పాటు నా కలలను సాకారం చేసుకునే శక్తినిచ్చావు. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోలేదమ్మా. ఎప్పుడూ నా హృదయంలో , నా ప్రతి అడుగులో ఉంటావు. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నువ్వే నా బలం అమ్మా.’ అని ఫేస్‌బుక్‌లో పోస్టులో రాసుకొచ్చారు.

ఇదిలా ఉండగా, సినీ ఇండస్ట్రీలో గోపీ సుందర్ ఒకరిగా గుర్తింపు పొందారు. గోపీ సుందర్.. తెలుగులో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, భేలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి, 18 పేజెస్ వంటి సినిమాలకు సంగీతం అందించారు.

Exit mobile version