Site icon Prime9

Formula e race: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన ఈడీ

ED Enters Field in Formula e race: ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఈడీ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ కోరింది. ఇందులో భాగంగానే ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్స్ ఇవ్వాలని లేఖ రాసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేస్తుందని తెలుస్తోంది.

మరోవైపు, తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై చర్చకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar