Earthquake Shakes Andhra Pradesh: ఏపీలో మళ్లీ భూంకపం సంభవించింది. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వరుసగా మూడో రోజు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10.34 నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది ఏం జరుగుతుందో అర్ధం కాక ఇబ్బందులు పడ్డారు. అలాగే తాళ్లూరు మండంలో స్వల్పంగా భూమి కంపించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఇటీవల కృష్ణా జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయాన్నే 7 గంటల సమయంలో పలు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనలు చెందారు. అలాగే తెలంగాణలో కూడా స్వల్ప భూకంపం వచ్చింది. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించడంతో భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కృష్ణా జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయాన్నే 7 గంటల సమయంలో పలు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనలు చెందారు. అలాగే తెలంగాణలో కూడా స్వల్ప భూకంపం వచ్చింది. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించడంతో భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు.
అయితే అంతకుముందు డిసెంబర్ 21న ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో రెండు సెకండ్ల పాటు కంపించింది. అయితే ఈ ప్రకంపనలపై భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.