Director Ram Gopal Varma Sentenced to Three Months Jail in Cheque Bounce Case: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆర్జీవీని అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది.
అయితే, 2018లో చెక్ బౌన్స్ కేసు విషయంలో మహేశ్ చంద్ర అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాడు. గత ఏడేళ్లుగా చెక్ బౌన్స్ కేసు విచారణ జరుగుతోంది. కానీ వర్మ మాత్రం అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.
ఇదిలా ఉండగా, ఈ నేరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 131లోకి వస్తుందని కోర్టు చెప్పింది. ఈ సెక్షన్ కింద చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్లు కోర్టు వివరించింది. అయితే ఇదే కేసు విషయంలో గతంలో వర్మ ఒకసారి బెయిల్ కూడా వరించింది.