Site icon Prime9

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

Rajendra Prasads daughter passes away: టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చినట్లు తెలిసిందే.

ఈ మేరకు రాజేంద్రప్రసాద్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని కోరారు.

Exit mobile version