Site icon Prime9

Daily Horoscope: నేడు ఈ రాశుల వారికి అనుకూలమైన సమయం

Horoscope

Horoscope

Daily Horoscope: మనుషుల జీవన స్థితిగతులు గ్రహాల ఆధారంగా మారుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. దీని ప్రకారం.. ఫిబ్రవరి 7వ మంగళవారం నాటి రాశిఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం: ఈ రాశి వారికి అనుకూలమైన సమయం ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది.

దీంతో పాటు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయండి.

ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి.

సాహసోపేతమైన విజయాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.

వృషభం: పనులు పూర్తి చేసేందుకు తగిన కాలం ఉంటుంది. మీకున్న సామార్ధ్యంతో ఎలాంటి పనైనా పూర్తి చేస్తారు.

స్నేహపూర్వక వాతావరణం.. కొంతమంది వ్యక్తుల వల్ల రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది.

పూర్వ స్నేహితులు కలిసే అవకాశం. దీని వల్ల మంచి మార్పు జరగవచ్చు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి.

అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.

మిథునం: ఈ రాశి వారికి ఇది అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఉత్సాహంతో పనిచేస్తే మంచి జరుగుతుంది.

ఇతరుల నుంచి ఏదైనా ఆశించకపోవడం మంచింది. ఆశించి జరగకపోతే నిరాశకు గురవుతారు.

ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వొద్దు. ఇస్తే ఇబ్బందులు తప్పవు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి.

కర్కాటకం: వేరొకరి విషయంలో జోక్యం అస్సలు చేసుకోవద్దు. అవి లేనిపోని తలనొప్పులు తీసుకురావచ్చు.

శుభాకార్యల్లో పాల్గొనే అవకాశం ఉంది. కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేస్తే అనుకున్నవని జరుగుతాయి.

సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి.

 

ఈ రాశుల వారికి శుభయోగం

సింహం: ఈ రాశి వారికి చాలా మంచి సమయం. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు మంచి ప్రతిఫలం పొందడానికి సమయం. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో మీకు అనుకూలంగా పురోగతి ఉంటుంది.

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

కన్య: గతంలో చేసిన పనులకు మంచి ఫలితాలను అందుకుంటారు. ముందు ముందు మంచి కాలం ఉంటుంది.

ఇబ్బందుల్లో ఉన్న మీ మిత్రుడు ఏదైనా సాయం కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మీ శక్తి కొద్దీ సహాయం చేయండి.

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

తుల: గందరగోళ పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది.

మీ బంధువులను కలిసే అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న పనికి సంబంధించి మంచి వింటారు.

చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

వృశ్చికం: ఈ రాశి వారు కొత్తవారిని కలుసుకుంటారు. వారిని ఆకట్టుకునేలా ప్రవర్తిస్తారు.

భయాలు దూరమై ధైర్యంగా ముందడుగు వేస్తారు. గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

ధనస్సు: ఎప్పటి నుంచో చేస్తున్న పనులకు తగిన ఫలితాలు అందుకుంటారు.

పరిశోధనలకు తగిన ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు చాలా మంచి సమయం. ఏకాగ్రత పెరుగుతుంది.

ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది.

మకరం: చాలా ఆనందంగా గడుపుతారు. చేసే పనులకు రాబోయే రోజుల్లో ప్రతిఫలం ఉంటుంది.

దగ్గర వాళ్లతో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. డబ్బులు అనవసరమైన వాటికి ఖర్చు చేయకుండా, ఆలోచించి ఖర్చు చేయాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు.

కుంభం: ప్రయాణాలు మానుకోవడం మంచిది. సెల్ఫ్‌ మోటివేట్‌ చేసుకోండి.

శుభసమయం ఉంటుంది. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మీనం: ఊహించని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరీ ఆందోళన చెందవద్దు.

యాక్టీవ్‌గా ఉండాలని అనుకుంటారు. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar