Daily Horoscope: చాలామందికి తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ఎక్కువ మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం: ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయం అనుకూలంగా ఉండదు. పనులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మనసులో అనుకున్న కార్యాలు సఫలికృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరం ఉండటం మంచింది. ఇష్టాదైవాన్ని ప్రార్ధించాలి.
వృషభం: ఉద్యోగం బాగుంటుంది. స్థిర నిర్ణయాలు శక్తినిస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. ముఖ్యవ్యక్తులతో సున్నితంగా వ్యవహరించండి.
మిథునం: ఈ రాశివారికి నేడు మంచి సమయం. అనుకున్నది సాధిస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి అదృష్టయోగంతో పాటు.. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ధర్మ మార్గంలో ముందుకు వెళ్లండి. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.
ఉద్యోగం విషయంలో మంచి ఫలితాలు..
కర్కాటకం: ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. చేసేపనిలో ఏకాగ్రత ఉండాలి. నిరంతర కృషి అవసరం. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవద్దు. స్వల్ప ఆటంకాలు ఉన్నా భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.
సింహం: నేడు ఈ రాశివారికి అదృష్టకాలం నడుస్తోంది. పనులను సకాలంలో పూర్తి చేసుకోంది. ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బుద్ధిబలంతో పని చేస్తే మంచి లాభాలున్నాయి.
కన్య: సకాలంలో పనులను పూర్తి చేసుకోండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. చేసే పనుల్లో ఏకాగ్రత అవసరం. ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఎదురుచూస్తారు. ఆర్ధిక వనరుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
తుల: నేడు ఈ రాశివారికి అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో విషయంలో శుభవార్త వింటారు. అలోచించి పనులు చేయాలి. సరైన ప్రణాళికల్ని సిద్ధం చేసి అమలు చేయండి. తోటివారితో శాంతంగా మాట్లాడాలి. అపార్ధాలకు తావివ్వవద్దు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
వృశ్చికం: అద్భుతమైన వ్యాపార యోగం ఉంది. బుద్ధి బలంతో పనిచేస్తే విశేషమైన ధనలాభాలుంటాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. శాంతంగా సంభాషించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ధనస్సు: నేడు ఈ రాశివారికి ఇది మంచి సమయం. ఆశించిన ఫలితాలు నెరవేరుతాయి. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న స్థాయికి చేరతారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం: అద్భుతమైన వ్యాపారయోగం ఉంది. బుద్ధి బలంతో విశేష లాభాలను గడిస్తారు. ఆర్థికంగా మిశ్రమకాలం.
రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఒక ఆపద నుంచి బయట పడతారు. దేనికీ తొందరపడవద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి.
ఈ రాశివారికి అదృష్టయోగం
కుంభం: నేడు ఈ రాశివారికి అదృష్టయోగం ఉంటుంది. మనోబలంతో పని చేస్తే.. అనుకున్నది సాధిస్తారు.
ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. అవసరాలకు మిత్రుల సాయం తీసుకుంటారు. పనుల్లో అలసత్వం వహించకూడదు.
మీనం: ఉద్యోగం బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ త్వరగా లక్ష్యాన్ని చేరుకోండి. నూతన విషయాలు తెలుసుకుంటారు.
పనులు వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంది.