Daily Horoscope: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
ఈ రాశివారికి గుడ్ న్యూస్..
మేషం: నేడు ఈ రాశివారికి ఆశించిన విధంగా ఉద్యోగం కలసివస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పని చేసే ముందు ఓసారి ఆలోచించండి. ప్రణాళిక బద్ధంగా పనులను పూర్తి చేయండి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి. సహచరుల సహకారం తీసుకోవడం మంచిది. బంధువులతో గొడవలు జరిగే అవకాశం.
వృషభం: ఈ రాశివారికి నేడు మంచి రోజు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేస్తారు. రోజు ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విహారయాత్రలకు అవకాశం ఉంది.
మిథునం: ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పలు రంగాలకు చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలు వెంటాడే అవకాశం ఉంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
కర్కాటకం: ఈ రాశివారికి ఉద్యోగ పరంగా.. స్ధిరత్వం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం విషయంలో శుభవార్త వింటారు. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది.
సింహం: ఉద్యోగులు శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగ విషయంలో సమయం అనుకూలిస్తుంది. అలాగే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
నిరుద్యోగులు శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
కన్య: ఏళ్లుగా ఉన్న కుటుంబ సమస్యలు తీరుతాయి. బంధువులతో ఉన్న గొడవలు చక్కబడతాయి.
ఆర్ధిక స్థితి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇతరులకు సాయం చేస్తారు. ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వివాదాలకు ఆస్కారం ఉంది. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల: ఈ రాశివారికి ఉద్యోగ జీవితం సాఫీగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.
ఎప్పటినుంచో ఉన్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయ పడతారు.
ఈ రాశివారు జాగ్రత్తలు పాటించండి..
వృశ్చికం: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో మార్పు ఉంటుంది. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు: ఈ రాశివారికి ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది.
ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో మాట్లాడెటపుడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది.
ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది.
మకరం: నిరుద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. వృత్తి రంగాల ఉద్యోగులు రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏళ్లుగా ఉన్న కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.
కుంభం: ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొండి బాకి వసూలు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక అవసరాలు తీరుతాయి.
పొదుపు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మీనం: ఉద్యోగం విషయంలో గుడ్ న్యూస్ వింటారు. అలాగే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.