Site icon Prime9

CM Chandrababu: ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తా.. సీఎం చంద్రబాబు వెల్లడి

CM Chandrababu In Deeptech And Govtech innovation National conclave: ప్రపంచంలో నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయులే ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ మేరకు సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అధునాతన టెక్నాలజీపై పలువురు నిపుణులతో చంద్రబాబు మాట్లాడారు. జనాభా పెరుగుదల గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. p4 కాన్సెప్ట్‌తో ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు.

ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఐటీ గురించి ఎవరు మాట్లాడినా హైటెక్ సిటీని ప్రస్తావించకుండా ఉండలేరన్నారు. ఇఫ్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ కానుందని వివరించారు. 2014- 19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతం ఉందని, ప్రస్తుతం 15శాతం టార్గెట్‌గా పనిచేస్తున్నామని వెల్లడాించారు.

పేదరిక నిర్మూలన ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని చంద్రబాబు అన్నారు. ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వ ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. అన్ని రకాల విద్యాసంస్థలు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఫుడ్ సప్లైకి కూడా ఏపీ గ్లోబల్ హబ్‌గా నిలిచిందన్నారు. సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు.

ప్రపంచంలో ఎక్కడైనా టెక్నాలజీపైనే చర్చ జరుగుతోందని, టెక్నాలజీలో అనేక కొత్త మార్పులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారిందన్నారు. భారత్‌లో మాత్రమే ఆధార్ ఉందన్నారు. దీని అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే మనమంత వండర్స్ క్రియేట్ చేయవచ్చనని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar