Site icon Prime9

BSNL 5G Smartphone: మామూలు స్కెచ్ కాదు బాబోయ్.. రూ. 4,999లకే BSNL 5G ఫోన్.. 120MP కెమెరా, మరెన్నో ప్రీమియం ఫీచర్లు!

BSNL 5G Smartphone

BSNL 5G Smartphone

BSNL 5G Smartphone: భారతదేశంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రతిరోజూ కొత్త సబ్‌స్క్రైబర్లను పొందుతుంది. దేశీయ ప్రజలకు BSNL ఇప్పుడు ఆకర్షణగా కనిపిస్తుంది. BSNL ఇటీవలే కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అభివృద్ధి చేయడానికి టాటా గ్రూప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త BSNL 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఏమిటి? దాని ధర ఎంత? లాంచ్ ఎప్పుడు? తదితర వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన కొత్త BSNL 5G మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

BSNL 5G  Smartphone Specifications
ఈ BSNL 5G ఫోన్ MediaTek డైమెన్సిటీ 9100 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్ లాంచ్ కానుందని రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న 5జీ మొబైల్ ఫోన్ల కంటే ఇి చాలా తక్కువ ధరకే లభిస్తుందని చెబుతున్నారు.

BSNL 5G ఫోన్ ఉత్తమ ఫీచర్ దాని బ్యాటరీ. రూమర్స్ ప్రకారం ఈ కొత్త BSNL ఫోన్ శక్తివంతమైన 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో 120 వాట్ల ఛార్జర్ కూడా ఉంటుందని చెబుతున్నారు. కేవలం 20 నిమిషాల్లోనే డివైస్‌ను ఫుల్ ఛార్జ్ చేసేలా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు.

ఈ మొబైల్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజంతా ఉపయోగించచ్చు. BSNL 5G ఫోన్ కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. 120MP మెయిన్ కెమెరా, 16MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

లీకైన సమాచారం ప్రకారం BSNL 5G ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ఒక మోడల్, 12GB RAM+256GB స్టోరేజ్‌తో మరొకటి, చివరగా 16GB RAM + 512GB స్టోరేజ్‌తో ఒక మోడల్‌ ఉంటుందని చెబుతున్నారు. ఇందులో డ్యూయల్ సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

ఈ కొత్త BSNL 5G ఫోన్ అంచనా ధర రూ. 4,999 నుంచి రూ. 9,999 మధ్యలో ఉంటుంది. అయితే తగ్గింపుతో రూ. 3,999 నుంచి రూ. 6,999 ధర వరకు ఉంటుంది. లీక్ ప్రకారం ఈ ఫోన్ లాంచ్ 2025 జనవరి, ఫిబ్రవరి మధ్య జరుగుతుంది.

Exit mobile version