BRS Working President KTR Filed lunch Motion Petition in TG High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈనెల 6వ తేదీన కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తన లాయర్‌ను విచారణకు తనతో పాటు అనుమతి ఇవ్వలేదు. దీంతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్..లాయర్‌ను లోపలికి అనుమతి ఇవ్వకపోవంతో తిరిగి వెళ్లారు. దీంతో విచారణ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అందులో ఈనెల 9వ తేదీన గురువారం విచారణకు రావాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఏసీబీ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు ఏ2 గా ఉన్న అరవింద్ కుమార్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.