KTR Sensational Decision On Politics: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాఫిక్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా సంక్షేమం, పథకాలను ప్రజలకు వివరిస్తున్నది. ఏడాదిపాటు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారో ప్రచారం చేస్తామని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్ కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు శనివారం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘కొన్ని రోజులపాటు వెల్‌నెస్ రిట్రీట్‌కి వెళ్తున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా కోల్పోరని ఆశిస్తున్నాను’ అంటూ స్మైల్ ఎమోజీతో కూడిన ట్వీట్ చేశారు. కొంతకాలం విరామం తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని సొంత పార్టీ నేతలు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారని ఆరా తీస్తున్నారు. ఇన్నాళ్లు సమావేశాలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో సెటైర్లు, కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కేటీఆర్ తొందరగా విరామం ప్రకటించడం వెనుక మతలబు ఏంటనే చర్చను తెరపైకి తీసుకువస్తున్నారు. దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
కీలక దశకు రాష్ట్ర రాజకీయాలు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇద్దామని, ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో వారి వైఫల్యాలను ఎండగడుతామని గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లుగా ఏడాది పాలన గడువు దగ్గరం పడుతుంది. మరోవైపు డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు, జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల బీజేపీ నేతలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయం అంతా కీలక దశకు చేరుకుంటున్నదనే టాక్ వినిపిస్తున్నది. మోడీ ఆదేశాలతో బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన కేటీఆర్ అకస్మాత్తుగా విరామం ప్రకటించడం వ్యక్తిగత వ్యవహారమేనా లేక మరేదైనా పొలిటికల్ రీజన్ ఉందా అనేది డిస్కషన్ గా మారింది.
కవిత ఎంట్రీ.. కేటీఆర్ బ్రేక్
బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే ఉహగానాలు కొంతకాలంగా జోరుగా వినిపిస్తున్నది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. రాబోయే రోజుల్లో కవిత సెంట్రిక్ గా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళిలను సిద్ధం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. కవిత బీసీ నినాదాన్ని రైజ్ అప్ చేస్తుండటంతో బీసీ కార్డుతో కారు పార్టీ పాలిటిక్స్ చేయబోతున్నదనే వాదన వినిపిస్తున్నది. ఇదే సమయంలో కేటీఆర్ వ్యూహాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయనే టాక్ కూడా ఉంది. కేటీఆర్ తీసుకుంటున్న ప్రతి మూవ్ మెంట్ పై రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దిలావర్ పూర్, లగచర్ల ఘటనల్లో కేటీఆర్ బూమరాంగ్ అయ్యాయేలా ప్రభుత్వం చేసిందనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామనుకునే ప్రయత్నంలో సొంత పార్టీనే డిఫెన్స్ లోకి నెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ తీసుకున్న విరామం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.