Site icon Prime9

Etela Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన తెలంగాణ మంత్రి

BJP MP Etela Rajender Attack On Land Broker Grabbers: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల పర్యటించారు. ఈ మేరకు పేదలను ఇబ్బంది పెడుతున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై చెల్లుమనిపించాడు. అనంతరం బ్రోకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేస్తున్నారని, ఇంటి స్థలాల యజమానులను కూడా ఇబ్బందులకు గురిచేయడంపై ఆయన మండిపడ్డారు.

అయితే, చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కొంతమంది అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారన్నారు. దొంగపత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు, అధికారులు దళారులతో కుమ్మకై పేదల భూములను లాక్కుంటున్నారన్నారు. పేదలు కొనుక్కున్నా భూములకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలే తప్పా.. పేదల కన్నీళ్లు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LIVE: BJP MP Etela Rajender Attack On Land Grabbers: రియల్‌ ఎస్టేట్స్ బ్రోకర్లను చెంప చెల్లు|Prime9

Exit mobile version
Skip to toolbar