Site icon Prime9

Bengaluru: బెంగళూరు జనాలకు చుక్కలు చూపిస్తున్న కొత్త రకం మాఫియా

Bengaluru

Bengaluru

Bengaluru: ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, కల్తీ మాఫియా.. ఇలా ఎన్నో రకాల మాఫియా గ్యాంగ్స్ ను చూశాం. అయితే మెట్రో సిటీ బెంగళూరు లో కొత్త రకం మాఫియా హల్ చల్ చేస్తోంది. ఈ మాఫియా కారణంగా జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మాఫియా ఏంటంటే.. పంక్చర్ మాఫియా. ఇపుడు ఈ మాఫియానూ నగరంలో కీ రోల్ గా ఉంది.

రిపేర్ షాపులకు కిలో మీటర్ దూరంలో రోడ్డలపై మేకులు, పదునైన వస్తువులు, తీగలు పడేస్తున్నారు. దీంతో అటు వైపు వచ్చే వాహనాలు పంక్చర్లు అవుతున్నాయి. ఫలితంగా ఆ చుట్టు పక్కల షాపుల్లో రిపేర్ చేయించుకునేందుకు వాహనాదారులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో షాపుల వాళ్లు బాగా సంపాదించుకుంటున్నారు. అయితే ఈ ఘటనలపై పోలీసులుకు ఫిర్యాదులు వచ్చాయి.

 

బెంగళూరులో దడపుట్టిస్తున్న వెరైటీ మాఫియా.. వాహనాల టైర్లకు విపరీతంగా  పంక్చర్లు..!

రోడ్లపై కిలోల కొద్ది ఇనుము(Bengaluru)

నంజప్ప కూడలి, అపేరా జంక్షన్, అనేపాళ్య తదితర ప్రాంతాల్లో తరచుగా కిలోలకు పైగా ఇనుప వస్తువులు దొరుకుతున్నాయి. రహదారులు, దత్త పీఠానికి వెల్లే దారిలో ఎక్కువగా ఈ మాఫియా తమ ఆగడాలు చూపిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఇలాంటి చర్యలను అరికట్టగలమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అశోక్ నగర పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ రోడ్లపై పడి ఉన్న మేకులు, చువ్వలు తొలగిస్తూ వాహన దారులకు సపోర్టుగా నిలుస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar