Bengaluru: ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, కల్తీ మాఫియా.. ఇలా ఎన్నో రకాల మాఫియా గ్యాంగ్స్ ను చూశాం. అయితే మెట్రో సిటీ బెంగళూరు లో కొత్త రకం మాఫియా హల్ చల్ చేస్తోంది. ఈ మాఫియా కారణంగా జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మాఫియా ఏంటంటే.. పంక్చర్ మాఫియా. ఇపుడు ఈ మాఫియానూ నగరంలో కీ రోల్ గా ఉంది.
రిపేర్ షాపులకు కిలో మీటర్ దూరంలో రోడ్డలపై మేకులు, పదునైన వస్తువులు, తీగలు పడేస్తున్నారు. దీంతో అటు వైపు వచ్చే వాహనాలు పంక్చర్లు అవుతున్నాయి. ఫలితంగా ఆ చుట్టు పక్కల షాపుల్లో రిపేర్ చేయించుకునేందుకు వాహనాదారులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో షాపుల వాళ్లు బాగా సంపాదించుకుంటున్నారు. అయితే ఈ ఘటనలపై పోలీసులుకు ఫిర్యాదులు వచ్చాయి.
రోడ్లపై కిలోల కొద్ది ఇనుము(Bengaluru)
నంజప్ప కూడలి, అపేరా జంక్షన్, అనేపాళ్య తదితర ప్రాంతాల్లో తరచుగా కిలోలకు పైగా ఇనుప వస్తువులు దొరుకుతున్నాయి. రహదారులు, దత్త పీఠానికి వెల్లే దారిలో ఎక్కువగా ఈ మాఫియా తమ ఆగడాలు చూపిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఇలాంటి చర్యలను అరికట్టగలమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అశోక్ నగర పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ రోడ్లపై పడి ఉన్న మేకులు, చువ్వలు తొలగిస్తూ వాహన దారులకు సపోర్టుగా నిలుస్తున్నారు.