Site icon Prime9

Erracheera The Beginning: రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని నటించిన “ఎర్రచీర – The Beginning” మూవీ.. డిసెంబర్ 20 న విడుదల

Erracheera The Beginning

Erracheera The Beginning

Erracheera The Beginning: శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – The Beginning. ఇప్పటికే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబు అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది.

ఈ సినిమాలో 45 నిమషాలు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో సుమన్ బాబు స్వీయ దర్శకత్వం చేస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమాను మథర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్‌తో రూపొందించినట్లు నిర్మాత ఎన్. వి.వి. సుబ్బారెడ్డి తెలిపారు.

బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ లో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరికీ కన్నీరు తెపిస్తుందని, కారుణ్య చౌదరి సరికొత్తగా కనిపించబోతుంది అని దర్శకుడు సుమన్ బాబు తెలియజేశారు. శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, మొదలుగు వారు ప్రధాన పాత్రదారులుగా ఈ చిత్రంలో నటించారు.

ఈ సినిమాకి ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్, ప్రదీప్ – సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు.  “సినిమాను డిసెంబర్ 20 న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు విజయదశమి సందర్భంగా తెలియజేశారు.

బేబీ డమరి ప్రజెంట్స్

కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, CH. వెంకట సుమన్
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్,
సినిమాటోగ్రఫీ – చందు
ఆర్ట్ – నాని, సుభాష్,
పిఆర్ఓ – సురేష్ కొండేటి,
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్.

Exit mobile version