Site icon Prime9

Jagamerigina Satyam: రవితేజ మేనల్లుడి చిత్రం ‘జగమెరిగిన సత్యం’ రివ్యూ..!

jagamerigina satyam

jagamerigina satyam

Jagamerigina Satyam: అమృత సత్యనారాయణ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘జగమెరిగిన సత్యం’. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ సినిమాకి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎమోషనల్ రూరల్ డ్రామాగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది.

 

తెలంగాణలోని ఓ చిన్న ఊరులో సత్యం అనే యువకుడు జీవిస్తున్న జీవితం ఆధారంగా కథ సాగుతుంది. అతని జీవితం సాదాసీదాగా కనిపించినా, ఆ లోతుల్లో ఆత్మవిస్వాసం, ప్రేమ, బాధ, త్యాగం మిళితమై ఉంటాయి. సత్యం కథ కేవలం ఒక వ్యక్తి గాథ కాదు, అది ఒక ఊరి జీవితం, ఒక భూమి మనసు. సత్యం చుట్టూ నడిచే పాత్రలన్నీ మనం ఎక్కడో ఓ మూల చూసినట్టే ఉంటాయి. చినమ్మతో అతని బంధం, గ్రామంలోని రాజకీయాలు, మనిషి విలువలపై వచ్చిన సవాళ్లు ఇవన్నీ కథలో బలంగా రూపుదిద్దుకున్నాయి.

 

ప్రతి సీన్‌లోనూ ఊరి వాతావరణం, భాష, ఆచారాలు చూపించిన విధానం, చిన్న చిన్న సన్నివేశాల్లోనూ హృదయాన్ని తాకే భావోద్వేగం, సహజమైన పల్లె హాస్యం ఫస్ట్ హాప్ హైలైట్‌గా నిలవగా.. సత్యం జీవితంలో వచ్చిన తిరుగుబాటు, తాను నిలిచిన విలువలు, చివరికి ఊరిని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే అతని కృషి అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్‌లో ఇక్కడ కథ మరింత ఎమోషనల్ మలుపు తీసుకుంటుంది.

 

క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ హైపాయింట్ సినిమాకు హృదయం లాంటి భాగం. సత్యం ఏడిచినప్పుడు థియేటర్‌లో ప్రతి ఒక్కరు మనసులోనైనా ఏడుస్తారు. అంతటి బలమైన భావోద్వేగంతో కథ ముగుస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు చివరికి థియేటర్ బయటకు వస్తున్నప్పుడు రెండు కన్నీటి చుక్కలతోనే వెళతాడు.

 

ఇందులో గ్లామర్ ఉండకపోవచ్చు, కానీ నిజాయితీ మాత్రం వెన్నుదన్నుగా ఉంది. కథ, పాత్రలు, నటన, సినిమాటోగ్రఫీ అన్నీ సహజత్వంతో నిండిపోయి ఉంటాయి. సినిమాలో ప్రతి ఒక్కరిలో మన ఊరి మనిషిని చూస్తాం. ఇది ఒక సినిమా మాత్రము కాదు – అది మన ఊరును, మన భూమిని, మన మనిషిని తాకే అనుభూతి. ఇది చూడాల్సిన సినిమా కాదు.. అనుభవించాల్సిన సినిమా. దీనికి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు.

Exit mobile version
Skip to toolbar