Site icon Prime9

Ram Nagar Bunny: ‘రామ్ నగర్ బన్నీ’ కంప్లీట్ ఎంటర్ టైనర్.. ఇలాంటి మూవీ చేయడం అదృష్టం.. యంగ్ హీరో చంద్రహాస్

Attitude Star Chandrahass in Ram Nagar Bunny: టాలీవుడ్ యంగ్ హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్వకత్వం వహించగా.. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. ఇందులో విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు.

‘రామ్ నగర్ బన్నీ’ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ అని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారన్నారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా డెబ్యూ మూవీ కావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుతుందని అనుకోనని, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్ మా టీమ్ అందరిలో ఉందన్నారు.

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ సార్ నా గురించి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మా ‘రామ్ నగర్ బన్నీ’ సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పానని, సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నానని వెల్లడించారు. ఈ సినిమాలో సాధారణ యువకుడిగా కనిపిస్తానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటానన్నారు. ఇందులో అన్నిరకాల ఎమోషన్స్ చేసే అవకాశం ఈ చిత్రంలో కలిగిందన్నారు.

సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లి చూడొచ్చని, నలుగురు హీరోయిన్స్ ను కథా ఆధారంగా తీసుకున్నట్లు తెలిపారు. ఇక, ఈ సినిమాను మా నాన్న ప్రభాకర్ ప్రొడ్యూస్ చేశారని, నాన్న కూడా ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశారన్నారు. అలాగే దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశారన్నారు. ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా..అన్ని షేడ్స్ లో నన్ను చూపించారన్నారు. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జానర్స్ చేస్తాననే పేరు వచ్చింది. అయితే ఆటిట్యూడ్ స్టార్ అనేది నేను పెట్టుకున్నది కాదు.

Exit mobile version