Asaduddin Owaisi: బీజేపీ గెలుపునకు కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలే.. మండిపడిన ఎంఐఎం అధినేత

Asaduddin Owaisi slams Congress for blaming EVMs: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల తలకిందుకు కాషాయం పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. తొలుత గాలి హస్తం వైపు వీచిన ఆ తర్వాత బీజేపీ ముందంజలో నిలిచి కాంగ్రెస్ పై విజయం సాధించింది. దీంతో హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్‌ 37 స్థానాల్లో విజయం సాధించాయి.

అటూ జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లోనూ బీజేపీ హవానే కనిపించింది. అధికారంలోకి రాలేకపోయినప్పటికీ సీట్లను గణనీయంగా పెంచుకుంది. సొంతంగానే 29 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ఈ మేరకు హరియాణాలో బీజేపీ విజయాన్ని తాము స్వాగతించమని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈవీఎంలపై హస్తం పార్టీ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఈవీఎంలతోనే గెలిచారని ఆయన గుర్తు చేశారు. అయితే హరియాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా జేపీ మలీ గెలిచంది ఆఱోపించారు. ఈవీఎంలను నిందించడం పరిపాటిగా మారిందని, ఈవీఎంలతోనే మీరు ఒకచోట గెలిచి మరోచోట ఓటమి ఎదురయ్యేసరికి వాటిని నిందిస్తున్నారన్నారు.

హరియాణాలో నా అంచనా ప్రకారం బీజేపీ ఓడిపోవాల్సిందని ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయని, పదేళ్లపాటు హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ అంతర్గత విభేదాలతో బీజేపీ లాభపడిందని వెల్లడించారు. ఎన్నికల పోరులో బీజేపీకి కొంచెం ఓపెనింగ్ ఇస్తే చాలు.. దాన్ని సద్వినియోగం చేసుకుంటుందని అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించారు.