Arvind Kejriwal challenges Pm Modi: ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే.. తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు.
ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే తాను బీజేపీ మద్దతు ఇస్తానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదని, అవినీతి, నిరుద్యోగమేనని అర్థమైందని విమర్శలు చేశారు.
కాగా, హర్యానా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఓటమి చెందుతాయన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఇదే జరుగుతుందని ఎద్దేవా చేశారు. అదే విధంగా ఢిల్లీలో బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించదని విమర్శలు చేశారు. అలాగే హోంగార్డుల జీతాలు నిలిపివేయడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో ప్రజాస్ామ్య లేదని, ఎల్జీ పాలనలో ఉందని ఆరోపించారు.