Site icon Prime9

AP Inter Exams Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

AP Inter 2025 Exams Fee Deadline Extended: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేట్ విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఎలాంటి ఆలస్య రుసం లేకుండా డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష పీజులు చెల్లించేందుకు అనుమతి కల్పించారు.

ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియన్ 2025 మార్చి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా వచ్చే నెల 5 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియన్ బోర్డు ఇంటర్ విద్యార్థుల వార్షిక ఫీజుల చెల్లింపును గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar