Site icon Prime9

AP Highcourt: వైసీపీ నేతకు హైకోర్టులో బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

AP Highcourt big shock to ycp leader Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగానే ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరపిన హైకోర్టు చెవిరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇదిలా ఉండగా, గతంలో ఓ బాలిక విషయంలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా తిరుపతి పోలీసులు ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినా.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం రికార్డు చేశారు. దీంతో ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన తరఫున లాయర్స్ వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

 

Exit mobile version