Site icon Prime9

AP Cabinet: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 21 కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting started: ఏపీ క్యాబినెట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నఈ క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంతో పాటు మొత్తం 21 కీలక అంశాలపై క్యాబినెట్ చర్చిస్తోంది. 42, 43 సమావేశాల్లో సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలుపనున్నారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

అలాగే, ఇంటర్ విద్యార్థులు భోజన పథకం, మున్సిపల్ చట్ట సవరణకు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్యాబినెట్ భేటీలోనే మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు. మంత్రుల ర్యాంకింగ్స్ చాలా ఆసక్తికరంగా కొనసాగునుంది. అయితే ఇప్పటికే సెల్ప్ అసెసెమెంట్ సబ్మిట్ చేయాలని సూచించడంతో అందరూ సబ్మిట్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు విశ్లేషించనున్నారు. ఎవరెవరు ఎఫెక్ట్‌గా పనిచేస్తున్నారనే విషయాలతో పాటు సమర్థత వంటి వాటిపై ఫోకస్ చేయనున్నారు.

ప్రధానంగా అమరావతి, పోలవరంలు కీలక అంశాలుగా ఉన్నాయి. అమరావతికి సంబంధించి సుమారు రూ.45వేల కోట్లకు ఇటీవల కాలంలో సీఆర్డీఏ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో ఇంజినీరింగ్ వర్క్స్‌కు సంబంధించి ఈ నెలఖరుకు టెండర్లు పూర్తి చేయాలని ప్రధాన లక్ష్యంగా క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు సంబంధించి కొంత ల్యాండ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇంతకుముందు ఇచ్చిన గడువు ముగిసింది. కాగా, కొత్త టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

Exit mobile version