Site icon Prime9

Pottel Trailer: ఆసక్తిగా అనన్య నాగళ్ల ‘పొట్టేల్‌’ ట్రైలర్‌

Pottel Trailer Out

Pottel Trailer Release: నటి అనన్య నాగళ్ల, నటుడు యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్‌’. సాహిత్‌ మోత్కురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. సరికొత్తగా తమ సినిమాను ప్రమోట్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, స్పెషల్‌ పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా మూవీ టీం ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది.

మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ మంచి మెసేజ్ ఇచ్చే కంటెంట్‌తో సాగింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి తన కూతురికి మంచి చదువు అందించాలని కోరుకుంటాడు. కానీ ఆర్థిక స్థోమత వల్ల అతడు కూతురి చదువుకు న్నో అడ్డంకులు వస్తుంటాయి. ఈ క్రమంలో గ్రామ దేవతకు బలి ఇచ్చే ఓ పొట్టేల్‌ మిస్‌ అవ్వడంతో అతడి కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో అద్యాంత ఈ ట్రైలర్ ఆసక్తిగా సాగింది.

Exit mobile version