iQOO 12 5G: బ్లాక్ బస్టర్ డీల్..  ఐక్యూ ప్రీమియం ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్.. రాస్కో మళ్లీ రావ్!

iQOO 12 5G: ఐక్యూ కంపెనీ గతేడాది అంటే డిసెంబర్‌లో iQOO 12 5Gని విడుదల చేసింది. భారతీయ కస్టమర్లను ఆకర్షించడంలో ఈ ఫోన్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ దీనిపై భారీ ఆఫర్ ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఫోన్‌పై EMI ఆప్షన్, బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ క్రమంలో ఫోన్‌పై కంపెనీ ఏమి ఆఫర్ చేస్తుంది. ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం

ఐక్యూ 12 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఐక్యూ 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 3,999 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రూ.49,999కి సేల్ చేస్తోంది. SBI క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుకూడా ఉంది. . రెండు ఆఫర్ల తర్ాత ఫోన్ క్క 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ.47,999కి ఆర్డర్ చేయవచ్చు. 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 52,999 ధరతో దక్కించుకోవచ్చు. తగ్గింపుతో పాటు ఈ ఫోన్‌ను 3 నుండి 9 నెలల నో కాస్ట్ EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా 38,400 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫోన్ 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 57,999కి లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.3,000 డిస్కౌంట్, రూ.2,000 బ్యాంక్ ఆఫర్లతో విక్రయిస్తోంది. రెండు డిస్కౌంట్లతో మీరు దీన్ని రూ. 52,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

iQOO 12 5G Features
ఈ 5G ఫోన్ 6.78 అంగుళాల 1.5K LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఫోన్ 16GB RAM + 1TB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 4.0 కస్టమ్ స్కిన్ ఆధారంగా ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఇందులో 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50H ప్రైమరీ OIS కెమెరా, 50 మెగాపిక్సెల్ Samsung JN1 అల్ట్రావైడ్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కంపెనీ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో మొబైల్ విడుదల చేసింది. ఇది 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, Wi-Fi, GPS మొదలైనవి ఉన్నాయి.