Site icon Prime9

Pushpa – 2: ‘పుష్ప – 2’ అప్డేట్.. అల్లు అర్జున్ సీరియస్ లుక్.. స్పెషల్ పోస్టర్ రిలీజ్

Allu Arjun rocks new poster from Pushpa 2 movie: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘ఫుష్ప- 2. ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఈ సినిమా మేకర్స్ అప్డేట్ ప్రకటించారు.

ఈ సినిమాను డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే మేకర్స్ ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్టర్‌ను సోసల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సీరియస్‌గా కుర్చీలో కూర్చొన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, బ్రహ్మాజీతోపాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులతోపాటు సినిమా లవర్స్‌కి భారీ అంచనాలు ఉ్నాయి. మరోైపు సినిమా ఇప్పటికే కొన్ని బిజినెస్స్‌లకు సంబంధించిన పనులు పూర్తి చేసుకుని లాభాల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో మరోసారి అల్లు అర్జున్ మంచి హిట్ కొట్టేస్తాడని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.

Exit mobile version