Site icon Prime9

Allu Arjun: మొన్న పవన్‌ కళ్యాణ్‌, తాజాగా అల్లు అర్జున్‌ – నార్త్‌లో మన తెలుగు హీరోల క్రేజ్‌ చూశారా?

a question om Allu Arjun in KBC 16

a queestion on Allu Arjun in KBC 16 Show: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. సిల్వర్‌ స్క్రీన్‌పై తనదైన డ్యాన్స్‌ స్కిల్స్‌, స్టైలిష్‌ లుక్‌, మ్యానరిజంతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తాడు. ఇక ‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన బన్నీకి నేషనల్ వైడ్‌గా ఫ్యాన్‌ బేస్‌ పెరిగిపోయింది. ముఖ్యంగా నార్త్‌లో అల్లు అర్జున్‌ పేరు మారుమోగిపోయింది. బన్నీకి అక్కడ ఎంత క్రేజ్‌ ఉందో తాజాగా కౌన్‌ బనేగా కరోడ్ పతి షో మరోసారి రుజువైంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’.

త్తరాదిన అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ షోకు గత కొన్ని సీజన్ల నుంచి ఆయనే హొస్ట్‌ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది 16వ సీజన్‌ జరుపుకుంటుంది. తాజాగా ఈ షోకు లేటెస్ట్‌ ప్రొమో విడుదల కాగా ఇందులో అల్లు అర్జున్‌పై ప్రశ్న అడగడం ఆసక్తిని సంతరించుకుంది. ఇటీవల ఇదే షోలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యటీ సీం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రశ్న అడిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్‌ గురించి ప్రశ్న రావడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

అల్లు అర్జున్ పై ప్రశ్న

అమితాబ్ బచ్చన్ కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ షోని సక్సెస్‌ ఫుల్‌గా నడిపిస్తున్నారు. అయితే ఇందులో హోస్ట్‌ అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్స్ సరైన సమాధానాలు చెప్పి లక్షలు, కోట్లు గెలుచుకుంటున్నారు. ప్రస్తుతం 16 సీజన్‌ను జరుపుకుంటున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. ఇందులో నార్త్‌కు చెందిన ఓ కంటెస్టెంట్స్‌ హాట్‌సీట్‌పైకి వచ్చారు. ఈ క్రమంలో 20వేల ప్రశ్నకు గానూ తనకు అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి కంటెస్టెంట్‌ అల్లు అర్జున్‌ అని సరైన సమాధానం చెప్పి రూ. 20 వేలు గెలుచుకున్నారు. ఇక ఇదే సీజన్‌లో ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రశ్న అడిగారు. ‘2024 జాన్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన నటుడు ఎవరు?’ అని ప్రశ్న అడిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నకు గానూ కంటెస్టెంట్‌ ఆడియన్స్‌ పోల్ తీసుకోగా చాలా మంది పవన్‌ కళ్యాణ్‌ ఓటు వేశారు. దీంతో అదే సమాధానం చెప్పి అతడు రూ. 1.60 లక్షలు గెలుచుకున్నారు.

Exit mobile version