Site icon Prime9

Singer Adnan Sami: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సింగర్ తల్లి కన్నుమూత

Adnan Sami’s mother passes away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగం నూరీన్ షమీ ఖాన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 77 సంవత్సారాలు. ఈ మేరకు అద్నాన్ సమీ సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు భావోద్వేగంతో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. చాలా బాధగా ఉందని, నా ప్రియమైన తల్లి బేగం నౌరీన్ సమీ ఖాన్ మృతి చెందిందన్నారు. ఇలా జరగడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయామని, ఈ వార్త తెలియగానే షాక్‌లో ఉన్నామని వెల్లడించాడు. అందరితో ఎంతో గౌరవంగా మాట్లాడి, వారితో ప్రేమగా, ఆనందంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. నాతో పాటు మా కుటుంబ సభ్యులను ఆమెను చాలా మిస్ అవుతున్నామని ఆవేదన చెందాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాలని కోరారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అద్నాన్ సమీ చేసిన పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు, అభిమానలు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అద్నాన్ సమీ.. బాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. అలాగే తెలుగులోనూ అద్నాన్ చాలా పాటలు రాశాడు. ఇందులో ప్రధానంగా దేవిశ్రీప్రసాద్‌కు పాటలు పాడారు. ఇక, సంగీతంలో చేసిన కృషికి గానూ అద్నాన్ సమీని 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

ఇదిలా ఉండగా, అద్నాన్ సమీ 1971 ఆగస్టు 15న లండన్‌లో జన్మించాడు. అతని తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్థాన్‌లోని ఆఫ్ఘన్‌కు చెందిన పష్టూన్, అతని తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందినవారు. అద్నాన్ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా చేరి తర్వాత సీనియర్ ప్రభుత్వ అధికారి అయ్యాడు. ఆయన 14 దేశాలకు పాకిస్తాన్ రాయబారిగా పనిచేశాడు. అద్నాన్ సమీ పాకిస్తానీ అయినప్పటికీ 2016లో భారతీయ పౌరసత్వానికి అర్హత సాధించాడు.

Exit mobile version