Site icon Prime9

Abhimani: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘అభిమాని’ మూవీ గ్లింప్స్.. రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు

abhimani movie glimpse released: సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అభిమాని’. ఇందులో . హీరోయిన్‌గా అక్సాఖాన్ నటిస్తుండగా.. అజయ్ ఘోష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, మేకర్స్ మూవీ గ్లింప్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ గ్లింప్స్‌ను దర్శకేంద్రులు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేయించారు.

ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడారు. సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ చాలా బాగుందన్నారు. ‘అభిమాని’ అనే టైటిల్ పెట్టడంతోనే సినిమా సగం విజయం సాధించిందన్నారు. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదని, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిల ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలనేదే సినిమా ఉద్దేశమని చెప్పారు.

ఇక సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచే తెలుసని గుర్తు చేశారు. అతను జర్నలిస్ట్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగిన తీరు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మూవీ మంచి విజయం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అల్ ది బెస్ట్ చెప్పారు.

ఇక అభిమాని సినిమా ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్‍లైన్‌తో తెరకెక్కించారు. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది. ఈ సినిమాకు రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడారు. నేను డైరెక్ట్ చేసిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్దినారు. ఈ మూవీ లో సురేష్ కొండేటి గారు ప్రధాన పాత్రలో నటించారని, యముడిగా అజయ్ ఘోష్ సైతం నటిస్తుండగా.. మరో పాత్రలో జై క్రిష్ నటించారన్నారు. నమ్మకంతో ప్రధాన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సురేష్ కొండేటి, సినిమాను ప్రొడ్యూస్ చేసిన రెహమాన్, కందా సాంబశివరావు అభినందనలు తెలియజేశారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పరిచయం కొన్ని దశాబ్దాల నాటిదని హీరో సురేష్ కొండేటి చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’తో నా కెరీర్ మొదలైందన్నారు. ఈ సినిమాను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో పంపిణీ చేశానని గుర్తు చేశారు. అలా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఉన్న నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా రాఘవేంద్రరావు చేశారన్నారు.

దర్శకత్వం వహిస్తూ, వందకు పైగా సినిమాలు తీసినా.. ఇప్పటికీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిత్య విద్యార్థిగానే వ్యవహరిస్తారన్నారు. వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారన్నారు. శ్రీదేవి మొదలు కొని ఎంతోమంది హీరోయిన్లకు స్టార్ డమ్‌ను కట్టబెట్టారన్నారు. హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ.. నేను నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల కావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.

Exit mobile version