Site icon Prime9

Tirupati: తిరుపతిలో ఘోర విషాదం.. తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి

6 killed in Tirupati temple: తిరుపతిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాల జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో నాయుబాబు(51), రజిని(47) లావణ్య(40), శాంతి(34), నిర్మల(50). మల్లిగ(49)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో 40మంది గాయపడినట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్వన టికెట్ల జారీలో మూడు చోట్ల తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం వద్ద పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఓ మహిళ సృహ కోల్పోయింది. ఆమెను తరలించేందుకు ఓ గేటు ఓపెన్ చేయగా.. భక్తులు టోకెన్ల జారీ కోసం అనుకొని పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు.

మరోవైపు. తిరుపతిలో టోకెన్ల కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలో వదలడంతో తొక్కిసలాట జరిగినట్లు ఆరోపిస్తున్నారు. దీనికి పోలీసులు, సిబ్బంది కారణమని అంటున్నారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెట్ల సందర్భంగా 3 చోట్ల భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం వద్ద చోటుచేసుకున్నాయి.

అయితే, తొక్కిసలాటలో చిక్కుకుని ఊపిరాడని భక్తుల పరిస్థితి దారుణంగా మారింది. స్పృహ కోల్పోయిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తులను కాపాడేందుకు తోటి భక్తులు చేసిన ప్రయత్నాలు అందరినీ కలిచివేశాయి. కొంతమంది సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించి సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

Exit mobile version