Volcano Burst in Indonesia: ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. లెవోటోబి లకిలకి అనే పర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో ఆకాశంలోకి సుమారు 6 కిలోమీటర్ల ఎత్తువరకు బూడిద ఎగసిపడింది. పర్యాటక ద్వీపమైన ఫ్లోర్స్ ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం బద్ధలైనట్టు జియోలాజికల్ అధికారులు తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇక అగ్నిపర్వతం విస్ఫోటనంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు మాస్కులు ధరించాలని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ హెడ్ మొహమ్మద్ వాఫిద్ తెలిపారు. అయితే ఆదివారం రాత్రి నుంచే విస్పోటనాలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా ఇండోనేషియా రింగ్ ఫైర్ కు సమీపంలో ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఆదేశంలో ఎన్నో క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయని సమాచారం.