Prime9

Israel US Embassy Damaged: అమెరికా దౌత్య కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఇరాన్ క్షిపణి

Israel US Embassy Damaged by Iran Missile:  ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయిల్ నగరాలలోకి దూసుకువచ్చాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయిల్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి బ్లాస్ట్ అయింది. దీంతో అమెరికా కార్యాలయం దెబ్బతిన్నది. కాగా ప్రాణాపాయం జరుగలేదు. ఈ ఘటన సోమవారం జరిగింది. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

 

టెల్ అవీవ్ అనే నగరంలో అమెరికా దౌత్య కార్యాలయం ఉంది. సోమవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో పడ్డాయి. దీంతో భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో భవనం కిటికీలు ద్వంసం అయినట్లు కనపడింది. ప్రోటోకాల్ ప్రకారం సిబ్బందిని సురక్షితమైన ప్రాంతానికి తరలించారు.

 

సోమవారం తెల్లవారుజామునుంచి ఇజ్రాయిల్ నగరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఐదుగురు మరణించగా 92మంది గాయపడ్డారు. అంతకుముందు ఇజ్రాయిల్ దాడులు ఇరాన్ ను తీవ్రంగా నష్టపరచడంతోపాటు అణు స్థావరాన్ని, అణుబాంబులు తయారు చేసే ప్రక్రియను పూర్తిగా ఇజ్రాయిల్ అడ్డుకుంది. దీంతో ఇరాన్ విచక్షణ కోల్పోయి దాడులకు దిగింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపే ప్రణాళిక నుంచి ఇజ్రాయిల్ వెనక్కి తగ్గాలని అమెరికా కోరింది.

 

Exit mobile version
Skip to toolbar