Prime9

UK : భారత్‌కు పంపిస్తుండగా.. లండన్ ఎయిర్‌పోర్టులో అక్రమ వలసదారుడి పరుగులు

British government follows in America’s footsteps : అక్రమ వలసదారుల విషయంలో అగ్రరాజ్యం అమెరికా బాటలోనే బ్రిటన్‌ సర్కారు నడుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు అక్రమ వలసదారులను భారత్‌‌కు పంపిస్తుండగా, ఓ వ్యక్తి అధికారుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. ఘటనకు నికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

ఆదివారం హీత్రూ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 2 వద్ద ఘటన జరిగింది. బ్రిటన్ అధికారులు అక్రమ వలసదారులను ఇండియాకు పంపిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి అధికారుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అతడు రన్‌వేపై పరుగులు తీశాడు. విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై అతడిని బంధించారు. అనంతరం అతడిని విమానం ఎక్కించారు. దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా, నెటిజన్లు భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

ఘటనపై హీత్రూ ఎయిర్‌పోర్టు అధికారి స్పందించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు వెంటనే పట్టుకున్నారని తెలిపారు. భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar