Site icon Prime9

Syria: సిరియా అంతర్యుద్ధంలో రెబెల్స్ విజయం.. అధ్యక్షుడు పరార్!

Syrian rebels topple President Assad: సిరియా అంతర్యుద్ధంలో రెబెల్స్ విజయం సాధించింది. ఈ మేరకు సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రెబల్స్ ప్రకటించింది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాత్రం ఎవరికి కనిపించకుండా పారిపోయినట్లు సమాచారం.

అయితే, సిరియా రాజధాని డెమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకున్న వెంటనే ఆ దేశ అధ్యక్షుడు అసద్ రష్యా తయారీ ఐఎల్ 76 విమానంలో పారిపోయనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసద్ ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

ఇదిలా ఉండగా, సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ గుర్తు తెలియని ప్రాంతానికి పరారైనట్లు తెలుస్తోంది. తమకు ఎటువంటి ప్రతిఘటనా ఎదురుకాలేదని రెబల్స్ పేర్కొంటున్నారు. సెడ్నాయా జైల్లో ఉన్న సిరియా పౌరులను విడిపిస్తున్నామన్నారు. మన దేశానికి జరిగిన అన్యాయం నేటితో ముగిసిందని సోషల్ మీడియా వేదికగా రెబల్స్ పేర్కొంది.

మరోవైపు అసద్ శకం ముగిసిందని సిరియా ఆర్బీ కమాండ్ తమ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. అలాగే అసద్.. ఎస్‌వైఆర్ 9218 విమానంలో సిరియా సముద్రం వైపు బయలుదేరగా.. మార్గమధ్యలో తిరిగి రిటర్న్ ప్రయాణించి కనిపించకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సిరియా అధికారికంగా వెల్లడించలేదు. కాగా, సిరియాలో ప్రభుత్వ పతనంపై అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిరియా అధ్యక్షుడు అసద్‌ను రష్యా, ఇరాన్ కాపాడలేదన్నారు.

Exit mobile version