Prime9

Space X Starship Failed: నింగిలోకి దూసుకెళ్లిన స్టార్ షిప్ సూపర్ హెవీ రాకెట్.. భూమికి తిరిగి వస్తూ క్రాష్!

Space X Starship Failed: స్పేస్ ఎక్స్ తన స్టార్ షిప్ సూపర్ హెవీ రాకెట్ టెస్ట్ ఫ్లైట్ పరీక్షను ఇవాళ ఉదయం నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం గంటలకు దక్షిణ టెక్సాస్ లోని బోకా చికా బీచ్ సమీపంలోని కంపెనీ స్టార్ బేస్ లాంచ్ సైట్ నుంచి రాకెట్ ప్రయోగం చేపట్టారు. కాగా రాకెట్ ప్రయోగంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా తిలకించాయి. అనుకున్నట్టుగానే రాకెట్ ప్రయోగం సక్సెస్ గా జరిగింది. కానీ కొంత సమయానికి స్టార్ షిప్ నియంత్రణ కోల్పోయింది. దీంతో స్పేస్ లోకి వెళ్లి తిరిగి భూమి వచ్చే సమయంలో భూవాతావరణంలోకి ప్రవేశించగానే రాకెట్ పేలిపోయింది. ఘటనను స్పేస్ ఎక్స్ నిర్ధారించింది. ఈ మిషన్ కు స్టార్ షిప్ ఫ్లైట్ 9 అని పేరు పెట్టారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి మరింత సమచాారం తెలియాల్సి ఉంది.

 

Exit mobile version
Skip to toolbar