Site icon Prime9

Pope Successor : పోప్ ఫ్రాన్సిస్‌ రేసులో ఎంతమంది ఉన్నారంటే?

Pope Successor

Pope Successor

Pope Successor : పోప్ ఫ్రాన్సిస్‌ సోమవారం ఉదయం కన్నుమూశారు. క్యాథ‌లిక్ మ‌త పెద్ద ఎన్నిక కోసం మ‌రో రెండు వారాల్లో స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఆ కాంక్లేవ్‌లో నూతన పోప్‌ను ఎన్నుకుంటారు. 140 కోట్ల మంది క్యాథ‌లిక్ క్రైస్త‌వుల‌కు బాస్ ఎవ‌రు కాబోతార‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఈ అంశంపై అప్పుడే చర్చ మొదలైంది.

 

2025 జనవరిలోనే నిర్ణయం..
ఈ ఏడాది జనవరిలో సమావేశం జరిగింది. సమావేశంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించారు కూడా. 80 లోపు వయస్సు ఉన్న కార్డినల్స్‌ మాత్రమే పోప్‌ ఎంపిక రహస్య ఓటింగ్‌లో పాల్గొననున్నారు. 252 కార్డినల్స్‌లో 138 మందికి మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఓటింగ్‌ సిస్టీన్‌ ఛాపెల్‌లో నిర్వహించనున్నారు. ఓటింగ్ పూర్తిగా రహస్య విధానంలో జరుగుతోంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు ప్రతి కార్డినల్‌ ఓటింగ్‌ సమయంలో చర్చించిన అంశాలను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఉల్లంఘిస్తే బహిష్కరణ వేటు పడుతుంది.

 

రోజువారీ నాలుగు రౌండ్లు ..
రోజువారీ 4 రౌండ్లు చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థికి మూడింట రెండోంతుల మెజార్టీ లభించే వరకు ఓటింగ్‌ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. పోప్‌ జాన్‌పాల్‌-2 విధానంలో స్వల్పమార్పు చేసినట్లు చెబుతారు. మొదటిరోజు ఎన్నికలో మాత్రమే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. 10-12 రోజుల వరకు మెజార్టీ నెంబర్‌ను ఎవరు సాధించలేకపోతే తర్వాత సాధారణ మెజార్టీ వచ్చిన పోప్‌గా వారసుడిగా ఎన్నికవుతారు.

 

ఎవరూ విజయం సాధించకపోతే..
ఇక్కడ ఆసక్తికర అంశం ఒకటి ఉంది. ఎన్నికలో ఎవరూ విజయం సాధించకపోతే బ్యాలెట్‌ పత్రాలను నల్లటి పొగను విడుదల చేసే ప్రత్యేక రసాయనాలతో కాల్చేస్తారు. తెల్లటి పొగ వెలువడితే పోప్‌ ఎన్నికైనట్లు సంకేతం. ఇదంతా సిస్టీన్‌ ఛాపెల్‌లో జరుగుతుంది. బయట ఉన్నవారికి ఎన్నికల ఫలితం తెలియజేయడానికి ఈ విధానం వినియోగిస్తారు.

 

పోటీపడుతున్న ప్రముఖులు..
ఫ్రాన్సిస్‌ వారసత్వానికి పోటీపడుతున్న వారిలో టాప్-5 కార్డిన‌ల్స్ ఉన్నారు. వారిలో వాటికన్‌ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పీట్రో పారోలిన్‌ ఉన్నారు. ఐరోపా బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ మాజీ అధ్యక్షుడు పీటర్‌ ఎర్డో కూడా రేసులో ఉన్నారు. కార్డినల్‌ పీటర్‌ టురుక్సన్‌, కార్డినల్‌ లూయీస్‌ టాగ్లో, కార్డినల్‌ మాట్టో జూప్పీ, కార్డినల్‌ రేమాండ్‌ లియో బుర్కె పేర్లు ప్రాధానంగా వినిపిస్తున్నాయి.

 

 

Exit mobile version
Skip to toolbar