Site icon Prime9

Pakistan: యుద్ధ భయంతో పారిపోతున్న పాక్ ఆర్మీ

Pakistani soldiers are resigning out of fear of a war with India

Pakistani soldiers are resigning out of fear of a war with India

పాక్ ఆర్మీలో భయాందోళన
రాజీనామాలు చేస్తున్న పాక్ ఆర్మీ జవాన్లు
250 మంది ఆర్మీ అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా

Pakistan: భారత్ చర్యలతో పాకిస్తాన్ సైన్యాలు దడుసుకుంటున్నాయి. యుద్ద భయంతో ఆర్మీ అధికారులు, సైనికులు ఆర్మీకి రాజీనామాలు చేస్తున్నారు. 2 వందల 50 మంది ఆర్మీ అధికారులు, 12 వందల మంది సైనికులు రాజీనామా చేశారు. లెఫ్ట్ నెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బకారి ఆర్మీ చీఫ్ అసిప్ మునీర్ కు వివరాలతో నివేదికను సమర్పించారు. క్వెట్టాలోని 12వ సైనిక దళం, నార్త్ ఏరియా ఫోర్స్ కమాండ్, మంగ్లా లోనొ ఒకటవ సాయుధ దళానికి చెందిన ఆర్మీ అధికారులు, సైనికులు రాజీనామా చేశారు. సైనికుల రాజీనామాలతో ఆర్మీ చీఫ్ అసిప్ మునీర్ ఆందోళన చెందారు.

 

దేశం వదిలి పారిపోయిన ఆర్మీ అధికారుల కుటుంబాలు
భారత్ ధాటికి పాక్ వణికిపోతోంది. బయటకు మేకపోతు గాంభీర్యం కనపరుస్తున్నా లోపల బిక్కచచ్చిపోతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుటుంబంతో సహా ఆర్మీ   అధికారుల కుటుంబాలు విదేశాలకు తరలించారు. దీంతో భారత్‌ను ఎదుర్కొనే సత్తా పాక్‌కు లేదని తెలుస్తోంది.

 

2019లో పుల్వామా ఘటనలోనూ మునీర్‌కు సంబంధం ఉంది. పుల్వామా ఘటన సమయంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. రెండువారాల క్రితం ఓ మీటింగ్‌లో మాట్లడిన ఆయన భవిష్యత్తులో కశ్మీర్ తమ జీవనాడిగా ఉంటుందన్నారు. హిందువుల కంటే ముస్లింలు అన్ని విషయాలలో భిన్నం అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది బలికాగా పలువురు గాయపడ్డారు. ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ కఠిన చర్యలకు పూనుకుంది. దౌత్యపరంగా కఠిన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసింది.

 

దాయాది చేసిన దుస్సాహసానికి, దురాగతానికి భారీ మూల్యం తప్పదన్న విషయం తెలుసు. అందుకే పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణాలను లెక్కబెడుతున్న పాక్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతోంది. భారత్ ప్రతీకారచర్యను తట్టుకునే దమ్ము ఏమేరకు ఉందని లోలోపల బేరీజులు వేసుకునే పనిలో పడింది.

 

భారత్ భూభాగంలో నెత్తురును పారించే ముందు విచక్షణ కోల్పోయి మృగంలా వ్యవహరించిన పాక్ ఇప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి దార్లు వెతుక్కుంటోంది. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుటుంబంతోపాటు చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించేశారు. భారత్ ఎటాక్ చేస్తుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Exit mobile version
Skip to toolbar