Site icon Prime9

Oldest Bible: ప్రపంచంలోనే అతి పురాతన బైబిల్.. ఎంత ధర పలికిందంటే..?

Oldest Bible

Oldest Bible

Oldest Bible: ప్రపంచంలోనే అతి పురాతన బైబిల్ ను అమ్మకానికి ఉంచితే దాదాపు రూ. 314 కోట్ల ధర పలికింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధర పలికిన చేతి రాసిన బైబిల్ గా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. ఈ బైబిల్ ను రొమేనియాలోని అమెరికా మాజీ రాయబారి ఆల్ఫ్రెడ్ మోసెస్ కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లో ఉన్న మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు.

 

క్రీస్తుశకం 880 నుంచి 960 నాటి(Oldest Bible)

కాగా ‘కోడెక్స్ సాసూన్’ అనే హీబ్రూ బైబిల్ వరల్డ్ లోనే అతి పురాతమైన బైబిల్ లో ఒకటి. దీనిని క్రీస్తుశకం 880 నుంచి 960 మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు. రాత పత్రుల్లో భాగంగా అమెరికా రాజ్యాంగం 2021లో దాదాపు రూ. 400 కోట్లకు పైగా ధర పలికింది. 1994 లో జరిగిన వేలంలో లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్ లీ సెస్టర్.. అప్పట్లోనే రూ. 300 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం.

 

 

 

 

Exit mobile version