Site icon Prime9

North Korea: ఉక్రెయిన్‌పై యుద్ధం.. ఉత్తరకొరియా నుంచి 3వేల మంది సైనికులు

North Korea has sent 3,000 more soldiers: ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా తరఫున ఉత్తర కొరియా నుంచి 3వేల మంది సైనికులు వెళ్లినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అలాగే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

కాగా, రష్యాకు ఇప్పటివరకు ఉత్తర కొరియా నుంచి సుమారు 11వేల మంది సైనికులు చేరినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపింది. అయితే, సియోల్ ప్రకారం…ఈ యుద్దంలో సైనంలో దాదాపు 4వేల మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి.

 

అంతేకాకుండా, ఉత్తర కొరియా నుంచి సైన్యంతో పాటు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను సైతం రష్యాకు తరలించింది. అలాగే 220కి పైగా 170 మిల్లీమీటర్లతో పాటు 240 మిల్లీమీటర్ల శతఘ్నులను కూడా మాస్కో నగరానికి పంపించినట్లు దక్షిణ కొరియా తెలిపింది.

 

ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాతో రష్యా మాడ్రన్ స్పేస్, ఉపగ్రహ టెక్నాలజీలను పంచుకుంటోందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్యాంగ్ యాంగ్ సేవలకు ఆయుధ వినియోగం, శిక్షణలను సైతం మాస్కో అందజేయనుంది. కాగా, ఇవాళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించారు.

Exit mobile version
Skip to toolbar