North korea chief sister warns of provocative response to US: అమెరికాతో పాటు మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా -అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీప కల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది.
దక్షిణ కొరియా- అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది. ద.కొరియా-యూఎస్ సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహంగా కిమ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, దక్షిణకొరియాలో ఉన్న బుసాన్ రేవులో అమెరికా దేశానికి చెందిన విమాన వాహన నౌకను మొహరించారు.ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తర కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత బైడెన్ ప్రభుత్వం శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోందని జోంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక అని, దీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు.
ఈ విమాన వాహక నౌక ఆదివారం బుసాన్ తీరానికి రాగా.. గతనెల ఈ రేవులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపింది. దీనిని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. కాగా, అమెరికా ఘర్షణ విషయంలో బలమైన ఉన్మాదానికి అద్దం పట్టనుంది. అయితే వాషింగ్టన్ ప్రమాదకర కవ్వింపు చర్యలతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనలు కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల సైనిక ఘర్షణకు దారితేసే అవకాశం ఉంది. కవ్వించేవారిపై చర్యలు తీసుకొనే మా చట్టబద్ధమైన హక్కును కచ్చితంగా వాడుకొంటామని ఉత్తర కొరియా రక్షణశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా గుడ్డిగా తన బలాన్ని నమ్ముకొంటోందని వ్యాఖ్యానించింది
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, అమెరికా ఆయుధ ప్రదర్శనను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలను నాటో ఆసియా వెర్షన్ గా ఉత్తర కొరియా అభివర్ణించింది. అవి ప్రమాదకరమైన పరిణామాలుగా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వ్యతిరేకంగా ఈ సైనిక విన్యాసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తరకొరియా అంటోంది. ఇప్పటికే.. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు, సైనిక విన్యాసాలకు దీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి భారీ రక్షణ విన్యాసాలు చేశాయి. ఈ విన్యాసాలను 11రోజుల పాటు జరిపారు. ఫ్రీడమ్ షీల్డ్ 23 అనే కంప్యూటర్ సిములేషన్‌తో పాటు వారియర్ షీల్డ్ ఎఫ్‌టీఎక్స్ అనే పేరుతో జరిగే పలు రకాలైన శిక్షణ విన్యాసాలు జరిపామని దక్షిణ కొరియా తెలిపింది.