Site icon Prime9

Donald Trump: ఓటింగ్‌ వద్దు.. నచ్చిన వాళ్లను నియమించుకుంటా.. డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump: సెనెట్‌ ఓటింగ్‌తో సంబంధం లేకుండా తనకు నచ్చిన వాళ్లను నియమించుకుంటానని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ట్రంప్‌ తన పాలకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కేబినెట్‌ నియామకాలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెనెట్‌ సమ్మతి లేకుండానే తనకు ఇష్టంవచ్చిన అధికారులను నియమించుకునే హక్కు ఇవ్వాలని రిపబ్లికన్‌ చట్టసభ్యులను డిమాండ్‌ చేశారు. ఇందుకోసం నిబంధనలు మార్చాలని పట్టుబట్టినట్లు సమాచారం.

డెమోక్రట్ల జోక్యానికి కోత..
అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. కేబినెట్‌, జ్యుడీషియల్‌ పోస్టులకు ఎవరినైనా అధ్యక్షుడు నామినేట్‌ చేస్తే దానికి సెనెట్ అనుమతి పొందడం తప్పనిసరి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్షుడు సెనెట్‌ ఓటింగ్‌కు బైపాస్‌ చేసే సదుపాయం ఉంటుంది. తాజాగా ట్రంప్‌ దాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తద్వారా పరిపాలనలో డెమోక్రట్లు జోక్యం చేసుకునే అధికారానికి కోత పెట్టాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పక్ష నేతను ఎన్నుకునేందుకు ఓటింగ్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సెనెట్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం దక్కింది. సభలో మొత్తం 100 మంది సభ్యులుండగా.. రిపబ్లికన్‌ పార్టీకి 52, డెమోక్రటిక్‌ పార్టీకి 47 సభ్యులు ఉన్నారు. దీంతో సెనెట్‌లో రిపబ్లికన్లు తమ పార్టీ పక్ష నేతను ఎన్నుకునేందుకు బుధవారం ఓటింగ్‌ జరగనున్నది. సెనెటర్లు జాన్‌ థునే, జాన్‌ కోర్నిన్‌, రిక్‌ స్కాట్‌ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితులేనని సమాచారం.

Exit mobile version