Site icon Prime9

Lady attack on Passengers: రైల్వేస్టేషన్ లో మహిళ వీరంగం.. 12 మందికి గాయాలు!

hamburg

hamburg

Lady attack with knife 12 people injured in Hamburg Germany: జర్మనీలోని హాంబర్గ్ రైల్వేస్టేషన్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. కత్తితో విచక్షణారహితంగా పలువురిపై దాడికి దిగింది. దీంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ వయస్సు 39 ఏళ్లు ఉంటుందని.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 

కాగా నిన్న సాయంత్రం 6.30 గంటలకు హాంబర్గ్ స్టేషన్ లో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే మహిళ దాడిలో గాయపడిన ప్రయాణికుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే బాధితుల వివరాలు వెల్లడిస్తామని, మహిళను విచారిస్తున్నామని అధికారులు చెప్పారు. ఘటన అనంతరం రైల్వేస్టేషన్ లోని 4 ప్లాట్ ఫామ్ లను మూసివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు ఆందోళనకు గురికాకుండా భద్రతా సిబ్బంది ధైర్యం చెప్పారు. అయితే ఆ మహిళ ఎందుకు దాడి చేసిందో కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు.

Exit mobile version
Skip to toolbar