Site icon Prime9

Festival: అక్టోబర్ నెలను ‘హిందూ సంప్రదాయ మాసం’ గా ప్రకటన…ఎక్కడంటే?

Month of October is called as 'Hindu traditional month'

Month of October is called as 'Hindu traditional month'

America: భారత దేశంలో హిందూ సంప్రదాయల పవిత్రత ఉగాది పండుగలతో ప్రారంభమౌతాయి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు హిందువులకు ఎంతో ప్రత్యేకం. ముఖ్య పండుగలు దసరాతోపాటుగా దీపావళి, ధనత్రయోదశి వేడుకల్ని ప్రజలు ఘనంగా జరుపుకొంటుంటారు. ఈ క్రమంలో అమెరికాలోని మేరీల్యాండ్ గవర్నర్ లారెన్స్ హోగన్ అక్టోబర్ నెలను ‘హిందూ సంప్రదాయ మాసం’ గా ప్రకటించారు. దీంతో అక్కడ ఉన్న హిందువులు గవర్నర్ కు పెద్దయెత్తున ధన్యవాదాలు తెలిపిన విషయం అందరికి తెలిసిందే..

మరో వైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రానున్న దీపావళి వేడుకల్ని శ్వేత సౌధంలో నిర్వహించే యోచనలో ఉన్నట్లు అధికార ప్రతినిధి జీన్ పియరీ తెలిపారు. ఎప్పుడు, ఎలా నిర్వహించేది అనే విషయాలు త్వరలో తెలయచేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత్ తోపాటు అమెరికాలోని ప్రవాస భారతీయులతో ఉన్న అనుబంధం నేపథ్యంలో దీపావళి పండుగకు జో బైడెన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

మాజీ అధ్యక్షుడు బుష్ అధ్యక్ష్య హోదాలో ఉన్న సమయం నాటి నుండి శ్వేతసౌధంలో దీపావళి వేడుకల్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు.

Exit mobile version