Gotabaya Rajapaksa: థాయిలాండ్‌ కు మకాం మార్చిన గొటబాయ రాజపక్స

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాత్కాలికంగా నివసించేందుకు థాయిలాండ్‌ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్న రాజపక్స వీసా నేటితో ముగిసిపోతుంది. కాబట్టి సింగపూర్‌ నుంచి వేరే ఇతర దేశానికి మకాం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 11:08 AM IST

Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాత్కాలికంగా నివసించేందుకు థాయిలాండ్‌ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్న రాజపక్స వీసా నేటితో ముగిసిపోతుంది. కాబట్టి సింగపూర్‌ నుంచి వేరే ఇతర దేశానికి మకాం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరుగున ఉన్న థాయిలాండ్‌ ముందుకు వచ్చి తాత్కాలికంగా నివసించడానికి అనుమతించింది. అయితే థాయిల్యాండ్‌ కూడా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నివసించడానికి అనుమతించినట్లు ప్రధానమంత్రి ప్రయూత్‌ చాన్‌ ఓ చా తెలియజేశారు. అయితే శాశ్వత నివాసం కోసం రాజపక్స పయత్నిస్తున్నారని చాన్‌ ఓ చా పేర్కొన్నారు.

ఇక రాజపక్స విషయానికి వస్తే గత నెలలో శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగిసిన ఉవ్వెత్తు ఉద్యమంతో ఆయన దేశం విడిచి మాల్దీవ్‌స్‌ అటు నుంచి సింగపూర్‌కు తన మకాం మార్చారు. అయితే సింగపూర్‌ ప్రభుత్వం తాత్కాలికంగా నివసించడానికి అనుమతించింది. శాశ్వతంగా శరణార్ధి హోదా ఇవ్వడానికి నిరాకరించింది. థాయి ప్రధానమంత్రి కూడా మానవతా దృక్పథంల తమ దేశంలోకి అనుమతించామని,  ఆయనకు కూడా ఇది తాత్కాలికమే థాయి ప్రధానమంత్రి తెలియజేశారు. థాయిలాండ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు అనుమతించమని కూడా థాయిలాండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

థాయిల్యాండ్‌ విదేశాంగమంత్రి డాన్‌ ప్రముదావినాయ్‌ మాత్రం రాజపక్స థాయిల్యాండ్‌లో 90 రోజుల పాటు ఉండవచ్చునని తెలియాజేశారు. దీనికి కారణం ఆయనకు డిప్లమాటిక పాస్‌పోర్టు ఉండటమేనని వివరించారు. అదీ కాకుండా శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే కూడా రాజపక్స థాయిలాండ్‌లో తాత్కాలికంగా నివసించడానికి ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదన్నారు. అయితే థాయిలాండ్‌ ప్రభుత్వం ఆయన నివాసానికి ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఆయనే సొంతంగా ఇల్లు సమకూర్చుకోవాల్సి వస్తుందని విదేశాంగమంత్రి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే కూడా రాజపక్స శ్రీలంకకు తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని వెల్లడించారు. ఆయన తిరిగి మాతృదేశానికి తిరిగి తిరిగి రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తుతాయని ఆయన రాకపోవడమే మంచిదన్నారు. ఆయన తిరిగి శ్రీలంకకు వస్తారనే విషయం కూడా తనకు తెలియదని విక్రమసింఘే పేర్కొన్నారు.