Justin Trudeau’s Liberal Party to choose new leader on March 9: కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. ప్రస్తుత ప్రధాని జస్టిస్ ట్రూడో స్థానంలో కొత్త నేతను ఎంపిక చేయనున్నట్లు లిబరల్ పార్టీ ప్రకటించింది. అయితే సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో తాను ప్రధాని బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. కాగా, కొత్త నేతను ఎంపిక చేసే వరకు మాత్రమే పదవిలో కొనసాగుతానని వెల్లడించారు. కాగా, ఆయన తొమ్మిదేళ్లపాటు అధికారంలో కొనసాగారు.
ఇదిలా ఉండగా, కెనడా తదుపరి ప్రధానిపై చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా, ప్రధాని రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఇద్దరూ భారతీయులు కూడా రేసులో ఉన్నారు. అందులో చంద్ర ఆర్య, అనితా ఆనంద్ ఉండడం విశేషం. వీరిద్దరూ భారతీయ సంతతికి చెందిన హిందూ ఎంపీలు.
కాగా, కెనడియన్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న అనితా ఆనంద్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఆమెతో పాటు డొమినిక్ లెబ్లాంక్, మెలాన్ జోలీ, క్రిస్టియా ఫ్రీలాండ్, ఫ్రాంకోయిన్, ఫిలిప్ చాంప్లైన్, మార్క్ కార్నీలు కూడా పోటీలో ఉన్నారు.