Prime9

India China: భారత్ చైనా సర్వీసులు తిరిగి ప్రారంభం?

INDIA TO CHINA FLIGHT SERVICES: ఇండియా టూ చైనా విమాన సర్వీసులు పునఃప్రారంభానికి ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. కొవిడ్, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిపివేశారు. ఐదేళ్ల తర్వాత నేరుగా విమానా సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి కొంతకాలంగా ఇరుదేశాలు మధ్య చర్చలు జరుపుతున్నాయి. ఈనేపథ్యంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని కూడా మిస్త్రీ అభినందించారు.

చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్‌తో భేటీ అనంతరం రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపటంపై చర్చలు జరిపినట్లు మిస్రీ తెలిపారు. చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్ సమావేశంలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పునర్ నిర్మించడానికి చర్చలు జరిపినట్లు మిస్రి చెప్పారు. ప్రత్యక్ష విమాన సర్వీసులను పునఃప్రారంభించడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయనున్నామని.. వాణిజ్య, ఆర్థిక రంగాల్లో భారత్, చైనాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కొవిడ్ మొదలైనప్పటి నుంచి భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, ఇటీవల సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ, పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో ఇరుదేశాలకు నేరుగా విమాన సర్వీసుల అంశం కూడా ఒకటి. ఈ ఒప్పందాలపై చర్చించడానికి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్త్రీ చైనాను సందర్శించారు. ఇరుదేశాల మధ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

Exit mobile version
Skip to toolbar